తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బస్సు ఎక్కి ప్రయాణం చేశారు. గురువారం నాడు హైదరాబాద్ నగరంలోని సిటీ ఆర్డినరీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణించారు. తెలంగాణ ఆర్టీసీ నిర్వహిస్తున్న బస్ డే సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సజ్జనార్ బస్సు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేవారు వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సులో…
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు…
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై టి.ఎస్.ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన 5 రోజుల్లనే 1.3కోట్ల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చిందని… దీనిపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జనార్. టి.ఎస్.ఆర్టీసీని ప్రయాణీకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని… ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్న ప్రయాణిక దేవుళ్ళందరికి వందనాలు అని చెప్పారు. ఎటువంటి…
చాలా కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కళ వచ్చింది. ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ రాకే దానికి కారణం. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్‌భవన్. దాని గురించే ప్రస్తుతం సంస్థలో పెద్ద టాక్ నడుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బస్‌భవన్‌పై టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ..! TSRTCలో దాదాపు మూడేళ్లపాటు ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సారథ్యంలో పరిపాలన సాగింది. ఛైర్మన్ పదవి ఖాళీగా…