Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఓట్ చోరీ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. “హెచ్ ఫైల్స్” అనే శీర్షికతో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల రిగ్గింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్‌లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్‌ఎస్ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ భారీగా ప్రలోభాల పర్వం కొనసాగింది.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం మునిసిపల్ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు ఓటర్లు.కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జరుగుతుండడంతో అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ నేతల అరెస్టులు అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి. కుటుంబంలో స్థానికేతరులు తిష్టవేసి ఉన్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఉదయం నుంచి రెండుసార్లు పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో పరిస్థితిపై ఆరా తీశారు.…