ఐపీఎల్‌లో బెంగళూరు జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు… ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్… 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ ప్లే ఆఫ్ చేరాలంటే… టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిందే. కాగా, రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్ మినహా అంతా విఫలమయ్యారు. లూయిస్ 37 బంతుల్లోనే 58 రన్స్ చేయగా… జైశ్వాల్ 31 రన్స్ చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. చాహల్, షాబాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
150 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు… 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి… 153 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లీ, దేవ్‌దత్ తక్కువ పరుగులే చేసినా.. మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ, శ్రీకర్ జైశ్వాల్ 44 రన్స్ చేయడంతో… సులువుగా లక్ష్యం వైపు సాగింది… బెంగళూరు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ రన్ అవుటే హైలెట్. స్క్వేర్ లెగ్ దిశగా కోహ్లీ కొట్టిన బంతిని డైవ్ చేసి ఆపిన రియాన్ పరాగ్… కన్నుమూసి తెరిచేలోగా గురి చూసి వికెట్లను కొట్టాడు. దాంతో కోహ్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రాజస్థాన్‌పై విజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరిన బెంగళూరు… ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.