హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి హెచ్ సీయూ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకెళ్ళిన కారు.. అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మానస,డ్రైవర్ అబ్దుల్ రహీం, మరొక జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందారు. సిద్దు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ కి గాయాలయినట్టు తెలుస్తోంది. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన డ్రైవర్ అబ్లుల్ రహీం మరణించాడు. అబ్దుల్ రహీం మాదాపూర్ హాస్టల్లో వుంటున్నాడు.

అతని వయసు 25 ఏళ్ళు. గచ్చిబౌలిలోని జేవీ కాలనీ నుంచి లింగంపల్లి వైపు వేగంగా దూసుకెళ్ళింది కారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగా కారు డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమీర్ పేట హాస్టల్లో వుండే ఎం.మానస వయసు 19 ఏళ్ళు. ఈమెది ఓల్డ్ బజార్, బడేపల్లి, జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా. ఆమె విద్యార్ధిని. అమీర్ పేటలోనే వుండే మరో అమ్మాయి ఎన్ మానస ప్రమాదంలో తీవ్ర గాయాలతో మరణించింది. బెంగళూరులోని దొడ్ బళ్ళాపూర్, గంగాధర పుర ఈమె స్వస్థలం. సినీ ఆర్టిస్ట్ సిద్ధు వయసు 24 ఏళ్ళు. గచ్చిబౌలి ఏపీహెచ్ బి కాలనీలో నివాసం వుంటున్నాడు. ఇతను ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.