హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి హెచ్ సీయూ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకెళ్ళిన కారు.. అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మానస,డ్రైవర్ అబ్దుల్ రహీం, మరొక జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందారు. సిద్దు అనే మరో…