తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
కొత్త సంవత్సరం వేడుకలకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు బెజవాడ సిద్ధమైంది. మొన్నటివరకు బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో నానా రచ్చ చేసిన మందుబాబులు.. ఇప్పుడు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రావడం ఫుల్ కిక్కే కిక్కు అని అంటున్నారు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.
న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడంలో హైదరాబాదీలు వెరీ స్పెషల్…! థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అంటేనే మందు… విందు… చిందు…! ఈ సరదా సమయంలో మత్తు తోడైతే…! మరింత మజా. ఈ గమ్మత్తైన అనుభూతి పెందోందుకు సిటీ పార్టీ లవర్స్ ఆరాటపడుతుంటారు. ఇలాంటి వారే టార్గెట్ గా నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ రారమ్మని పిలుస్తున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీ ఈవెంట్లు, థీమ్ ఓరియెంటెడ్ ఈవెంట్లు, టాప్ డీజే ప్లేయర్స్ ఉన్న ఈవెంట్లకు ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ లవర్స్..…
పంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్ ఆక్లాండ్ వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మధుర జ్ఞాపకాలను మదిలో దాచుకుంటూ 2022కి గుడ్‌బై చెప్పిన ఆక్లాండ్ వాసులు.. కోటి ఆశలతో ప్రపంచంలోనే అందరికంటే ముందే 2023కి స్వాగతం పలికారు.
Tirumala: మరో 35 రోజుల్లో నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ప్రజలందరూ 2022కు వీడ్కోలు పలికి 2023కు స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. కావాల్సిన భక్తులకు ఆన్‌లైన్‌లో వీటిని అందజేసేలా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్లకు పోస్టు ద్వారా పంపుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘పబ్లికేషన్స్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల…
కొత్త సంవత్సరం వేళ ఫుడ్ డెలివరీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. సరికొత్త రికార్డుసు సృష్టించాయి. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 31 వ తేదీన స్విగ్గిలో ప్రతి నిమిషానికి 9 వేల ఆర్డర్లు బుక్ చేయగా, జొమాటోలో నిమిషానికి 8 వేల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నది. గతేడాది డిసెంబర్ 31 వ స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డర్లు రాగా, ఆ రికార్డును స్విగ్గి ఈ…
చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలకండికొత్త ఆశలకు స్వాగతం చెప్పండికొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ…ఎన్టీవీ పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరం వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఏడాది వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో కొత్త ఆశలు, ఆశయాలు చిగురిస్తాయి. కొత్తగా ఏదో చేయాలని మన మది పులకరించిపోతుంది. మన మనసు కొత్త అనుభూతికి లోనవుతుంది. గత జ్ఞాపకాలు వెంటాడుతున్నా వాటికి వీడ్కోలు పలికి ఉత్సాహంగా కొత్త ఏడాదిని ప్రారంభిద్దాం. కరోనా కాలానికి గుడ్‌బై…
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. ఈరోజు బిల్లింగ్ క్లోజ్ వరకు సుమారు 40 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. 34 లక్షల కేసుల బీర్లు అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ చరిత్రలోనే ఇది రికార్డ్ అని, ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం ఇదే…
కరోనా కారణంగా చాలా దేశాల్లో 2020, 2021 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. 2022 నూతన సంవత్సర వేడుకలను ధూమ్ ధామ్‌గా నిర్వహించాలని అనుకున్నా… కుదిరేలా కనిపించడంలేదు. ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ఆంక్షలు విధించారు. యూరప్, అమెరికా దేశాల్లో వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కానీ, ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇక కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం రోజున కొన్ని…