‘విశ్వాసం’తో శివకు రజనీకాంత్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజనీకాంత్ తో సినిమా చేయాలన్నది తమిళ దర్శకుల కల. ఆ కలను ‘అన్నాత్తే’తో నెరవేర్చుకున్నాడు శివ. తెలుగులో గోపీచంద్ సినిమాతో దర్శకుడైన శివ తమిళంలో వరుస విజయాలతో టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘అన్నాత్తే’తో కమర్షియల్ హిట్ కూడా సాధించాడు. నిజానికి ఈ సినిమా అవకాశం శివకు తను అంతకు ముందు డైరెక్ట్ చేసిన ‘విశ్వాసం’ వల్లే లభించిందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా రజనీనే.
‘అన్నాత్తే’ అనుభవాలను వాయిస్ నోట్ ద్వారా పంచుకున్న రజనీ దానిని హూట్ యాప్‌లో పోస్ట్ చేశాడు. ‘నేను నటించిన ‘పేట్ట’ అజిత్ ‘విశ్వాసం’ ఒకే టైమ్ లో విడుదలయ్యాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచాయి. ‘విశ్వాసం’ నిర్మాతను స్క్రీనింగ్ ఏర్పాటు చేయమని అడిగాను. ఫస్ట్ హాఫ్ వరకూ చూసిన తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేంత ప్రత్యేకత లేదే అనుకున్నాను. అయితే క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా స్వరూపం మారిపోయింది. పూర్తయ్యాక చప్పట్లు కొట్టకుండా ఉండలేక పోయాను. నిర్మాత త్యాగరాజన్‌ని అభినందించి దర్శకుడు శివతో మాట్లాడాలని చెప్పాను. ఫస్ట్ మీట్ లోనే శివ అంటే ఇష్టం ఏర్పడింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అమాయకంగా, నిజాయితీగా మాట్లాడాడు. తప దగ్గర ఏదైనా కథ ఉందా? అడిగాను. ఆ కథ ‘విశ్వాసం’లా హిట్ కొట్టాలని చెప్పాను. అయితే నాతో హిట్ సినిమా చేయడం చాలా ఈజీ అని శివ చెప్పాడు. అంతకు ముందు ఏ ఇతర దర్శకుడు నాతో అలా చెప్పలేదు. శివలోని విశ్వాసం నాకు బాగా నచ్చింది. అంతే కాదు 20 రోజుల్లోనే శివ స్క్రిప్ట్ పూర్తి చేసి నన్ను కలిశాడు. రెండు గంటలకు పైగా నేరేషన్ ఇచ్చాడు. స్క్రిప్ట్ విన్నాక కన్నీళ్లు వచ్చాయి. చెప్పిన విధంగా సినిమా చేయమన్నాను. నేరేషన్ కంటే మెరుగ్గా చేస్తానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే నాకు సూపర్‌హిట్ అందించాడు’ అని చెప్పాడు రజనీ. దీపావళికి విడుదలైన ‘అన్నాత్తే’లో కీర్తి సురేష్, నయనతార, మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషించారు.
- Tags
- Kollywood
- Rajinikanth
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!