పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల శిక్షపై అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు గుజరాత్ కోర్టుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. నేరారోపణపై మధ్యంతర స్టే కోసం అభ్యర్థించారు. రాహుల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పిటిషన్‌ను ఏప్రిల్ 13న విచారిస్తామని తెలిపింది. ఏప్రిల్ 13 వరకు బెయిల్‌ను పొడగించింది. అదే రోజు తదుపరి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. రాహుల్ గాంధీ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ సహా మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్(రాజస్థాన్), భూపేష్ బాఘేల్(ఛత్తీస్ గఢ్), సుఖ్విందర్ సింగ్ సుఖూ(హిమాచల్ ప్రదేశ్) కూడా సూరత్ కోర్టుకు వచ్చారు. కోర్టుకు హాజరు కావడానికి ముందు ఆయన నిన్న తన తల్లి సోనియా గాంధీని కలిశారు.
Also Read:Karnataka elections: కర్ణాటక ఎన్నికల్లో సరికొత్త వ్యూహం.. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
మరోవైపు రాహుల్ గాంధీ తన సోదరి, కొంతమంది పార్టీ నాయకులతో కలిసి సూరత్‌కు వెళ్లడంపై బీజేపీ మాటల దాడికి దిగింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. న్యాయస్థానాలపై ఒత్తిడి తెచ్చేందుకే పార్టీ నేతలు భారీగా సూరత్ కు వచ్చారని విమర్శించింది. అప్పీల్ దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీ సూరత్ వెళ్లే అవకాశం ఉంది. అప్పీల్ దాఖలు చేయడానికి దోషి వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సాధారణంగా, ఏ దోషి వ్యక్తిగతంగా వెళ్లరు. తనతో పాటు నాయకులు, సహాయకులతో కలిసి ఆయన వ్యక్తిగతంగా వెళ్లడం ఓ డ్రామా మాత్రమే’’ అని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్నది కూడా అప్పీల్ కోర్టుపై ఒత్తిడి తీసుకురావాలనే చిన్నపిల్లాడి ప్రయత్నమే. దేశంలోని అన్ని న్యాయస్థానాలు ఇటువంటి వ్యూహాల నుండి తప్పించుకోలేవు” అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read:YS Jagan: అది పార్టీకి, కేడర్‌కు నష్టం.. మనం అధికారంలో లేకపోతే కోట్లాది మందికి కష్టం..
అయితే, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. సూరత్‌లో తమ పార్టీ నేతలు ఉండటం ‘బల ప్రదర్శన’ కాదని, రాహుల్ గాంధీకి ‘మద్దతుకు చిహ్నం’ అని కాంగ్రెస్ పేర్కొంది. ఇది బల నిరూపణ కాదు.. దేశం కోసం పోరాడుతున్నాడు.. తన పోరాటానికి మద్దతిచ్చేందుకు ఆయన వెంట వెళ్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సూరత్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సూరత్‌కు వెళ్లకుండా నిరోధించేందుకు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తున్నట్టు నిరంతరం వార్తలు వస్తున్నాయి అని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ హిందీలో ట్వీట్ చేశారు.
Also Read:Andhra man killed: బోస్టన్‌లో బస్సు ఢీకొని ఆంధ్రా వ్యక్తి మృతి
కాగా, గత నెలలో సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో ఈ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు కోర్టు అతనికి 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే మరియు గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. ఈ తీర్పు రాగానే లోక్‌సభ సచివాలయం కూడా తక్షణమే స్పందించి రాహుల్‌పై అనర్హత వేటు వేసింది.