పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. భారతదేశంలో రాజ్యాంగం విజయం సాధిస్తుందని, రాజవంశ రాజకీయాలు కాదని తీర్పు స్పష్టం చేసిందని ఆ పార్టీ పేర్కొంది.
సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల శిక్షపై అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు గుజరాత్ కోర్టుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు.