ప్రధాని మోదీ డిగ్రీ పట్టా అంశంపై ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల గుజరాత్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీ అన్నీ మోడీ డిగ్రీ పట్టా అంశంపై గురి పెట్టాయి. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నేత అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: MS Dhoni: ఆడింది 3 బాల్సే.. కానీ రికార్డు సాధించాడు.. ధోనీ అంటే అట్లుంటది..
మంత్రుల పట్టాలపై ప్రశ్నించడం సరికాదని, ఒక నాయకుడు తమ హయాంలో ఏం సాధించారనే దానిపై ప్రజలు దృష్టి సారించాలని ఎన్‌సిపి నేత అజిత్ పవార్ అన్నారు. ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల గురించి అజిత్ పవార్ మాట్లాడుతూ.. 2014లో ప్రధాని మోదీకి డిగ్రీ ఆధారంగానే ప్రజలు ఓటేశారా.. ఆయన సృష్టించిన చరిష్మాయే ఎన్నికల్లో గెలవడానికి దోహదపడింది అని చెప్పారు.
ఇప్పుడు తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని డిగ్రీ గురించి అడగడం సరికాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై మనం ఆయనను ప్రశ్నించాలి. ప్రధాని డిగ్రీ ముఖ్యమైన అంశం కాదు అని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఆయన డిగ్రీపై క్లారిటీ వస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందా.. అతని డిగ్రీ స్థితిగతులను తెలుసుకుని ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు.
Also Read:MS Dhoni: ఆడింది 3 బాల్సే.. కానీ రికార్డు సాధించాడు.. ధోనీ అంటే అట్లుంటది..
గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తన కాలేజీ డిగ్రీలను ప్రజల డొమైన్‌లో పెట్టాలని అన్నారు. తమ ప్రధాని ఎంత చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా? అని ప్రశ్నించారు. కోర్టులో తన డిగ్రీని ప్రదర్శించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ డిగ్రీని చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధిస్తారా? అంటూ మండిపడ్డారు. నిరక్షరాస్యులైన లేదా తక్కువ విద్యావంతులైన ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.