తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు కొరత లేదని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్టాలకు సైతం తగినంత బొగ్గు సరాఫరా చేస్తున్నట్టు తెలిపారు. రానునున్న రోజుల్లో బొగ్గు నిల్వలను పెంచడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తున్నామన్నారు. సింగరేణి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి సంస్థ డైరెక్టర్లు,11మంది ఏరియాల జనరల్…
దేశంలో గత కొన్ని రోజులుగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మహారాష్ట్రలోని 13 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ధర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు నాలుగురోజులకు మించి లేవని, నాలుగురోజులు దాటితే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, ఈ సమస్యను పరిస్కరించకుండే విద్యుత్ సరఫరాకు అంతరాయం తప్పదని రాష్ట్రాలు కేంద్రాని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటి వరకు అనేకమార్లు కేంద్రం దీనిపై సమీక్ష నిర్వహించింది. దేశంలో బొగ్గు…
రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపై కేంద్రం పెత్తనం మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు అవకాశం ఇస్తున్నాయని, దీని వలన రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పొన్నాల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులను ప్రారంభించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు. లక్షకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం జరుగుతున్నదో కేసీఆర్ చెప్పగలరా…
భారత్‌లో త్వరలోనే విద్యుత్ సంక్షోభం రాబోతోంది.. దానికి ప్రధాన కారణం బొగ్గు కొరతే అనే వార్తలు గుప్పుమన్నాయి.. దానికి తగినట్టుగా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. బొగ్గు కొరతపై ప్రకటన చేయడం.. విద్యుత్ సంక్షోభానికి దారితీసి నాలుగు పరిణామాలు ఇవేనంటూ ప్రకటించడం జరిగిపోయాయి.. అయితే, బొగ్గు కొరత ఉందంటూ వస్తులను వార్తలను కొట్టిపారేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అని క్లారిటీ ఇచ్చిన ఆమె.. భారత్ మిగులు విద్యుత్ గల…
బొగ్గు దెబ్బమీద దెబ్బ కొడుతున్నది. దక్షిణాదిన బొగ్గు సమస్యలు ఉన్నప్పటికీ ఉత్తరాదితో పోలిస్తే తక్కువే అనిచెప్పాలి. ఉత్తరాది రాష్ట్రాలు బొగ్గు సమస్యతో అట్టుడికిపోతున్నాయి. డిమాండ్ ఉన్న విద్యుత్ కంటె తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో షార్టేజ్ వస్తున్నది. ఫలితంగా వినియోగదారులకు కోతలు విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోతలు నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఉంటోంది. ఇక బొగ్గు సంక్షోభంతో పంజాబ్ రాష్ట్రం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. అక్టోబర్ 11 వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో ఏకంగా…
దేశంలో బొగ్గు కొరత కారణంగా రాష్ట్రాలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రాలకు పలు కీలకమైన సూచనలు చేసింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ ను విక్రయిస్తున్నాయని, వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్‌ను అమ్ముకోవద్దని కేంద్రం సూచించింది. ఎక్కువ ధరల కోసం విద్యుత్‌ను అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కేటాయించని విద్యుత్‌ను వాడుకునే వెసులుబాటును తొలగిస్తామని…
దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు సంక్షోభం లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. కాగా, ఈరోజు ప్రధాని మోడి అధ్యక్షతన మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ప్రధాని సమీక్షను నిర్వహిస్తున్నారు. దేశంలోని థర్మల్…