TS Assembly KRMB Issue: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ బోర్డుకు అప్పగించరాదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపై కేంద్రం పెత్తనం మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు అవకాశం ఇస్తున్నాయని, దీని వలన రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పొన్నాల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులను ప్రారంభించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు. లక్షకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం జరుగుతున్నదో కేసీఆర్ చెప్పగలరా…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. కృష్ణా, గోదావరి జలాలకు సంబందించిన అన్ని విషయాలు బోర్డులే చూసుకుంటాయని చెప్పి గెజిట్‌ను విడుదల చేసింది. ఈ గెజిట్ అక్టోబర్ 14 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలియజేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రనేతలు ఆహ్వానిస్తుంటే, తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు జలాల విషయాన్ని బోర్డులకు అప్పగించడంపై మండిపడుతున్నారు. Read: రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కూడా అదే విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల నేతలు జల వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వాటాల విషయంలో వివాదం రోజురోజుకు పెరిగిపోతున్నది. జలవివాదంపై నగరి ఎమ్మెల్యే రోజా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెండురాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, కేంద్రం…