బెజవాడలో పొలిటికల్ హీట్.. కేశినేని భవన్‌కు భారీగా పార్టీ శ్రేణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెజవాడలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్‌పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని కూతురుకు మద్దతుగా ప్రచారం చేశారు.. కానీ, అంతర్గత కుమ్ములాటలో అలాగే కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే ప్రచారం కూడా ఉంది.. ఈ విషయాలపై కలత చెందిన కేశినేని.. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం కావాలనే నిర్ణయానికి వచ్చారనా తెలుస్తోంది.. పార్టీలో పరిస్థితులపై ఆయన అసంతృప్తిగా ఉండడమే దీనికి కారణం అంటున్నారు.
ఇక, కేశినేని ప్రకటనతో బెజవాడలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న కేశినేని నిర్ణయంతో రాజకీయం రాజుకోగా.. బెజవాడలోని కేశినేని భవన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. బెజవాడలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల చెంది కార్యకర్తలు.. భారీగా కేశినేని భవన్‌కు వచ్చారు.. ఎంపీ కేశినేని నానితో సమావేశమైన పార్టీ నేతలు, కార్యకర్తలు… 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.. అయితే, ఎన్నికల్లో పోటీపై కేశినేని క్లారిటీ ఇవ్వకపోయినా.. బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీంతో.. మరోసారి బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!