భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ జోషే వేరు. అయితే ఈ మ్యాచ్ పై విపరీతమైన బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయకేతనం ఎగరవేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆన్లైన్ లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టు పై భారీగా అంచనాలు పెంచుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కానీ ఇందులో విజయం సాధించేందుకు ఇండియాకే ఎక్కువ అవకాశాలు ఉండటంతో భారత్ గెలిస్తే ఒకటికి రెండు… అదే పాక్ గేళితే ఒకటికి నాలుగు తో ఈ బెట్టింగ్ ప్రస్తుతం నడుస్తుంది. అయితే ఈ బెట్టింగ్స్ లోని ఆఫ్ర్స్ ఇస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఈ బెట్టింగ్స్ కోసం ప్రత్యేకమైన యాప్స్ అలాగే పోలీసులకు దొర్లకుండా పేమెంట్స్ చేయడం కోసం ప్రత్యేక గేట్ వేలు కూడా క్రియేట్ చేసారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గేవారు గెలుస్తారు.. ఎక్కువ పరుగులు చేస్తారు.. ఎవరు అర్ధశతకాలు నమోదు చేస్తారు… ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు.. ఎవరు డక్ అవుట్ అవుతారు అంటూ ప్రతి దానిపై బెట్టింగ్ వేస్తున్నారు రాయుళ్లు.