దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో సెకండ్ వేవ్ ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు కూడా మహారాష్ట్ర, ఢిల్లీలో అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 32 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, ఢిల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 కేసులు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కోకేసు నమోదైంది.
Read: లైవ్: తెలంగాణలో ఒమిక్రాన్ అలజడి…
క్రమంగా అన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదైన తమిళనాడులో ఆంక్షలు మొదలయ్యాయి. దేశీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ప్రయాణికులు 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.