తైవాన్ దేశాన్ని ఒంటరిని చేసేందుకు డ్రాగన్ కుయుక్తులు పన్నుతున్నది. తైవాన్ తో సంబంధాలు ఉన్న దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు తాయిలాలు అందిస్తున్నది. తాజాగా తైవాన్‌తో సంబంధాలున్న నికారగువాను డ్రాగన్ దారిలోకి తెచ్చుకుంది. నిన్నటి వరకు తైవాన్‌తో దోస్తీ కట్టిన నికారగువా సడెన్‌గా ఆ దేశంతో తెగతెంపులు చేసుకొని డ్రాగన్‌కు జై కొట్టింది. తైవాన్‌ను డ్రాగన్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది.
Read: బొగ్గుగనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలి…
నికారగువాతో ఫ్రెండ్‌షిప్‌లో భాగంగా డ్రాగన్ 10 లక్షల టీకాలను అందించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా 2 లక్షల టీకాలను డ్రాగన్ ప్రత్యేక విమానంలో నికారగువాకు పంపింది. నికారగువాలో 38 శాతం మందికి మాత్రమే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ డోసులు వేశారు. 62 శాతం మంది కేవలం ఒక్కడోసు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్నారు. చైనా ఆపన్నహస్తం అందించి వ్యాక్సిన్లు పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది నికారగువా.