పోసాని వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్… మీమ్స్ తోనే అంతా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదంపై స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగానే పోసాని వివాదం నుంచి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం వరకు అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Read Also : పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఈ సెషన్ లో ఓ నెటిజన్ ‘మళ్ళీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా ?’ అని అడగ్గా… ‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’ అనే మీమ్ ను షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందని మరొకరు ప్రశ్నించారు. ‘తేజ్ త్వరలోనే మన ముందుకు వస్తాడు’ అని అన్నారు. ఇక ‘పవన్ కళ్యాణ్ మ్యాటర్ గురించి స్పందించండి’ అంటూ పవన్ అభిమానులు అడగ్గా గతంలో పవన్ గురించి పోసాని మాట్లాడిన వీడియోను సమాధానంగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ‘పవన్ మళ్ళీ హీరోగా యాక్ట్ చేస్తానంటే అతనికి బ్లాంక్ చెక్ ఇస్తా. కోటి, రెండు కోట్లు, పది, ఇరవై, ముప్పై కోట్లు… నాకు డేట్స్ ఇస్తే 40 కోట్లు కూడా ఇస్తా. ఆయనకు అంత డిమాండ్ ఉంది. టాలీవుడ్ లోనే ఇండియాలోని టాప్ హీరోల్లో ఆయన ఒకరు. 5, 10 కోట్ల కోసం ఆయన లంగా పనులు చేయరు. నాకు తెలుసు’ అని పోసాని స్వయంగా చెప్పడం అందులో కన్పిస్తుంది. ఇక పోసాని గురించి ఒక్క మాట అని అడగ్గా… ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫొటో పోస్ట్ చేశారు. ఆ సన్నివేశంలో బాలకృష్ణ ‘కుక్క మొరిగిందనుకో’ అనే డైలాగ్ చెప్తాడు. అలా మెగా ఫ్యాన్స్ కు ఈ మెగా బ్రదర్ ఏది డైరెక్ట్ గా చెప్పకుండా మీమ్స్, వీడియోలతోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆన్లైన్ సినిమా టిక్కెటింగ్ విధానంపై కూడా తనదైన శైలిలో స్పందించారు నాగబాబు. ‘విక్రమార్కుడు’లో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్ ‘చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్‌రా!’ అని వాపోతూ ‘మోసం చేసినవాడు బాగుపడడురా!’ అని బ్రహ్మానందం శపించగా… ‘ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి’ అని రవితేజ అంటాడు.



తాజావార్తలు
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?