మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై…