ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్భంగా నేడు రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో కోహ్లీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో ముంబై వస్తుంటే ఆర్సీబీ మాత్రం మూడు మార్పులతో వస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ఇది 10వ మ్యాచ్ కాగా ప్రస్తుతం 10 పాయింట్లతో బెంగళూర్ మూడవ స్థానంలో ఉండగా 8 పాయింట్లతో ముంబై 6వ స్థానంలో ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉంటుంది అనేది.
బెంగళూర్ : విరాట్ కోహ్లీ (C), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (WK), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
ముంబై : రోహిత్ శర్మ (C), క్వింటన్ డి కాక్ (WK), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్