సాధారణంగా మెయిల్స్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా, నెట్ బ్యాంకింగ్ ఇలా అన్నింటికి తప్పనిసరిగా పాస్‌వర్డ్ లు పెట్టుకోవాలి. కొంతమందికి అన్ని రకాల సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లలో ఖాతాలు ఉంటాయి. అలాంటప్పుడు వారు యూనిక్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను వినియోగిస్తుంటారు. కొంతమంది అన్నింటికీ కామన్‌గా ఒకటే పాస్‌వర్డ్‌ను వినియోగిస్తుంటారు. చాలా మంది యూజర్లు నిత్యం పాస్ వర్డ్స్ ను మారుస్తుంటారు. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. మరి మనదేశంలో ఎక్కువ మంది ఎలాంటి పాస్‌వర్డ్‌ను వినియోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Read: వీడు మామూలు దొంగ కాదు… చోరి చేసేందుకు…
దేశంలో అత్యధిక మంది యూజ్ చేసే పాస్‌వర్డ్ పేరు password. ఈ పదాన్నే ఎక్కువడా యూజ్ చేస్తున్నారట. దీని తరువాత 123456 అనే ఈజీగా గుర్తుండిపోయే పాస్‌వర్డ్ ను వినియోగిస్తున్నట్టు సర్వేలు తేలింది. వీటి తరువాత iloveyou, krishna, sairam, omsaira, sweetheart, sunshine, lovely అనే పదాలు వినియోగిస్తున్నారు.