వీడు మామూలు దొంగ కాదు… చోరి చేసేందుకు…

దొంగ‌త‌నం చేయాలంటే దానికి త‌గిన విధంగా విధంగా ప‌క్కాగా ప్లాన్ ఉండాలి.  ఎవ‌రికీ అనుమానం రాకూడ‌దు.  సీసీ కెమెరాల‌కు దొర‌క్కుండా దొంగ‌త‌నం చేయాలి.  అయితే, వీటితో పాటుగా ఓ దొంగ వెరైటీగా ప్లాన్ చేశాడు.  త‌న పాత య‌జ‌మాని ఇంటికి క‌న్నం వేయ‌డం కోసం ఏకంగా 5 కిలోల బ‌రువు త‌గ్గాడు.  వేసుకున్న ప్లాన్‌ను ప‌క్కాగా అమ‌లు చేసి న‌గుదు దోచుకెళ్లాడు.  అయితే, ఓ వ‌స్తువును అక్క‌డే వ‌దిలేయ‌డంతో పోలీసుల‌కు దొరికిపోయాడు.  వివ‌రాల్లోకి వెళ్తే…

Read: తీరం దాటిన వాయుగుండం… రాయ‌ల‌సీమ‌లో అతిభారీ వ‌ర్షాలు…

రాజ‌స్థాన్‌కు చెందిన మోతీ సింగ్ చౌహాన్ అహ్మ‌దాబాద్ కు చెందిన మోహిత్ మోరాడియా అనే వ్య‌క్తి ఇంట్లో ప‌నిచేశాడు.  య‌జ‌మాని ఇంట్లో న‌గదు ఎక్క‌డ ఉంటుంది, ఎటు నుంచి ఇంట్లోకి వ‌స్తే సీసీకెమెరాల‌కు చిక్క‌రు అనే విష‌యాల‌ను తెలుసుకున్నాడు.  గ్లాస్ కిటికీ ద్వారా లోప‌లికి వ‌స్తే క‌నిపించ‌ర‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన మోతీసింగ్ దానికోసం బ‌రువు త‌గ్గాల‌ని అనుకున్నాడు.  మూడు నెల‌ల పాటు ఒక్క‌పూట భోజ‌నం చేసి 5 కిలోల బ‌రువు త‌గ్గాడు.  అనుకున్న‌ట్టుగానే గ్లాస్ డోర్ ప‌గ‌ల‌గొట్టి లోనికి వ‌చ్చేశాడు.  అలా వ‌చ్చిన మోతీ సింగ్ 13.14 ల‌క్ష‌ల న‌గ‌దు, న‌గ‌లు దొచుకెళ్లాడు.  అయితే, గ్లాస్ డోర్ ప‌గ‌ల‌గొట్టిన వ‌స్తువును అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోవ‌డంతో దాని ఆధారంగా పోలీసులు మోతీ సింగ్‌ను ప‌ట్టుకున్నారు.  

Related Articles

Latest Articles