Anugula Rakesh Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజల షాపులను కూల్చివేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల పేదలకు చెందిన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ చర్యకు సంబంధించిన వివిధ ప్రశ్నలు ప్రజల్లో , రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..”అందగత్తెల కోసం పేదల షాపులను కూల్చడం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయానికి, అందగత్తెలతో రాష్ట్రానికి…
పేదలంటే చంద్రబాబు నాయుడికి కోపం, చిరాకు వస్తుందని ఆయన విమర్శించారు. మత్స్యకారుల తొక్కతీస్తాం, తోలుతీస్తామని గతంలో చంద్రబాబు వార్నాంగ్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తామన్నారు.. బీసీలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు అని మంత్రి సీదిరి అప్పల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Central Government: నూతన సంవత్సరం కానుకగా దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ…
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌జామ్‌లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం…
భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్…
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది తెలంగాణలో రేషన్ కార్డుల వ్యవహారం. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ళు గడుస్తున్నా రేషన్ కార్డుల్లో చనిపోయిన వారి పేర్లని తొలగించడం లేదు. దింతో చనిపోయిన వారికి రేషన్ బియ్యం సరఫరా అవుతుండగా.. బతికి ఉన్న వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చక పోవడం తో రేషన్ బియ్యం ఇవ్వడం…
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కష్టాలు పేదలను సతాయిస్తున్నాయి. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో రేషన్ బియ్యం రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వర్ డౌన్ సమస్యలతో ఇప్పటి వరకు 40 శాతం మందికి కూడా పంపిణీ జరగలేదు. మరోవైపు రేషన్ బియ్యం ఇచ్చే గడువు 15తో ముగియడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. తమకు రేషన్ బియ్యం అందుతాయా లేదా అని వారు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తరచూ సర్వర్…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా అందిస్తున్న 5 కిలోల ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ అనంతరం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్…