Women Youtuber : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ పవిత్ర జాతరలో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర విశేషాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించేందుకు, యూట్యూబర్ గ్యాంగ్ జాతర ప్రాంతానికి వచ్చింది. జాతరలో జనసందోహం మధ్య వీడియోలు చిత్రీకరిస్తుండగా, కొన్ని సార్లు భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు భావించి, కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో…
పండగ పూట మటన్, చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో నాన్ వెజ్ తినే వారికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రెండ్రోజులు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ ఏదైనా మటన్.. చికెన్ కంపల్సరీ..
మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
ఢిల్లీలోని పాలికా బజార్‌లోని ఓ దుకాణంలో రెండు చైనీస్ మొబైల్ జామర్‌లు స్వాధీనం చేసుకోవడంతో కలకలం రేగింది. ఈ జామర్ల సామర్థ్యం 50 మీటర్లు. ఈ సంఘటనపై షాపు యజమాని రవి మాథుర్‌ను అరెస్టు చేశారు. ఈ జామర్‌ను లజ్‌పత్‌రాయ్ మార్కెట్ నుంచి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్లు రవి తెలిపాడు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టంగా పూర్తి చేశారు.. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ట గావించారు.
ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 న వచ్చింది.. రేపు ఈ పండుగను జరుపుకొనేందుకు రామ భక్తులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాముని ఆలయాలు ముస్తాబు అయ్యాయి.. రాముడు ఇవాళ నుంచే ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఆ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం..…
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పొంగులేటి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుపై అపోహలు వద్దని.. పండుగ అయిపోగానే రైతులందరికీ రైతుబంధు అందుతుందని తుమ్మల తెలిపారు. ఎంత అహంకారం ఉన్నా.. ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
దీపావళి సందర్భంగా దేశంలోని పలు బ్యాంకులకు లాంగ్ వీకెండ్ హాలీడేలు వచ్చాయి. ఏకంగా 6 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దంతేరస్ దగ్గర నుంచి (10వ తేదీ నుంచి భాయ్ దూజ్ ముగింపు వరకు) ఈ నెల 15 వరకు అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.