జీవో 317ను రద్దు చేయాలి.. మావోయిస్టు పార్టీ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగ అవకాశాలను కోల్పుతున్న నిరుద్యోగులు, విభజన ప్రక్రియ ద్వారా బలి అవుతున్న ఉద్యోగులు, యువకులు ఏకమై జీవో నెం. 317ను రద్దు చేసే వరకు పోరాడండి అంటూ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ రాశారు.

స్థానికత లేకుండా మెరిట్, సీనియార్టీ ఆధారంగా కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియ మూలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారని భారత కమ్యూనిస్టు (మావోయిస్ట్) పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలతో అన్నీ ప్రాంతాలు స్థానిక విద్యార్థులు, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు ఉద్యోగా అవకాశాలను కోల్పుతున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విభజన ప్రక్రియ చేపట్టి స్థానిక నిరొద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఆశాస్త్రీయంగా పద్ధతులలో కొనసాగిస్తున్న బదిలీలతో ఇప్పటికే ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ అనాలోచిత చర్య మూలంగా ఉద్యోగులు మానసికంగానే కాకుండా, ఆర్ధికంగా కూడా ఇబ్బందులకు గురి అవుతారన్నారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
టీఆర్ఎస్ ప్రభుత్వపు అనాలోచిత చర్యను 3 లక్షలకు మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం పరిగణంలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలు చేస్తుందని విమర్శించారు. ఉద్యోగులతో కనీసం చర్చించకుండా బలవంతంగా అమలు పరుస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తరుపున పోరాడుతామన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?