తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ…
తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఖాళీగా వున్ర పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటని అన్నారు. మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారు. స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారన్నారు. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఉద్యోగం చేస్తున్న భార్య కేసులను కూడా పట్టించుకోక పోవడం దారుణం. అనారోగ్యం ఉన్న వారిని పట్టించుకోకుండా బదిలీలు చేశారు.…