ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే వెళ్లే ఆస్పత్రిని ప్రజలు ఆలయంగా భావిస్తారు. కానీ అలాంటి ఆలయంలో కీచకులు ఉంటే అంతే సంగతులు. ఏపీలో గుంటూరు జీజీహెచ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం వేలాది రోగులు జీజీహెచ్‌ను సందర్శిస్తుంటారు. అయితే ఇటీవల జీజీహెచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తాజాగా జీజీహెచ్‌లో దారుణం చోటు చేసుకుంది. పాత గుంటూరుకు చెందిన ఓ యువతికి ఛాతీలో నొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఈసీజీ తీయించేందుకు యువతిని ల్యాబ్‌కు పంపారు. అయితే అక్కడ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న హరీష్ అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈసీజీ తీయాలంటే దుస్తులు మొత్తం విప్పాలని యువతికి సూచించాడు. దీనికి యువతి ఒప్పుకోలేదు. బట్టలు విప్పకుంటే రిపోర్టులు సరిగ్గా రావని యువతిని నమ్మించాడు.
Read Also: మంగళసూత్రం తీసి పబ్ కి వెళ్లిన మహిళ.. అక్కడ ఏం జరిగిందంటే..?
దీంతో యువతి బట్టలు విప్పి బెడ్‌పై పడుకోగా… హరీష్ తన మొబైల్ ద్వారా వీడియో తీయడం ప్రారంభించాడు. ఇంతలో కళ్లు తెరిచిన బాధితురాలు యువకుడి చర్యను గమనించి పెద్దగా కేకలు వేస్తూ దుస్తులు ధరించి బయటకు పరుగెత్తింది. ల్యాబ్ లోపల జరిగిన విషయాన్ని సదరు యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతి తండ్రి నిలదీయగా యువకుడు తాను చెడుగా ప్రవర్తించలేదని బుకాయించాడు. మొబైల్ చూపించాలని అడిగితే ఎదురు తిరిగాడు. ఈ మేరకు బాధితురాలు, ఆమె తండ్రి జీజీహెచ్‌లోని అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు హరీష్ ఈసీజీ టెక్నీషియన్ కాదని… సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈసీజీ స్పెషలిస్ట్ శంకర్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడి స్థానంలో ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థికి బాధ్యతలు అప్పజెప్పారు. అయితే అతడు కూడా విధుల్లోకి రాకపోగా హరీష్‌ను తీసుకొచ్చి ఈసీజీ తీయిస్తున్నాడు. కాగా హరీష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల జీజీహెచ్‌లో ఓ పసికందును ఆస్పత్రిలో పనిచేసే వాళ్లే కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.