మహారాష్ట్రంలోని రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వెంటే ఉన్నారని.. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని స్పీకర్ వెల్లడించారు.
అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్ పవార్‌కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉన్నందున ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని స్పీకర్ తెలిపారు.
ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తిరుగుబాటు చేసి 2023 జూలైలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఇరు నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఇటీవల ఎన్నికల సంఘం కూడా ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని తేల్చి చెప్పింది. దీంతో శరద్ పవర్ కొత్త పార్టీ స్థాపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శరద్ పవార్ నేతృత్వంలోని వర్గానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్’ అనే కొత్త పేరు వచ్చింది.
ఇదిలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్‌దేనని స్పీకర్ తేల్చడంతో మద్దతుదారుల.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. శివసేన నేతలు కూడా అభినందనలు తెలిపారు.
#WATCH | NCP workers celebrated outside the party office in Mumbai, following Maharashtra Assembly Speaker's decision that "Ajit Pawar faction is the real NCP" pic.twitter.com/mxHCeEazwN
— ANI (@ANI) February 15, 2024