ఏపీలో న్యాయపరమైన వ్యవహరాలపై జస్టిస్ చంద్రు కీలక కామెంట్లు చేశారు. ఏపీలో న్యాయ వ్యవస్థ ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని…హైకోర్టు తీర్పు ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని చట్టాలను ఉపసంహరించుకుందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కోర్టులను ఎదుర్కొలేక చట్టాన్ని ఉప సంహరించు కుందని…ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయని వెల్లడించారు.
విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములున్నాయని ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది.. ఆ జడ్జీలు విచారణలో ఉండకూడదని కోరిందని గుర్తు చేశారు. అయినా వాళ్లతోనే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.. న్యాయం ఎక్కడుంది..? అని ప్రశ్నించారు. పాలనాపరమైన లోపాలుంటే కోర్టుకెళ్తాం.. న్యాయ వ్యవస్థే వేరే డైరెక్షన్‌లో వెళ్తోంటే ఎక్కడికెళ్తాం..? అని నిలదీశారు. నిర్దేశించిన సమయంలోగా రిప్లై ఫైల్ చేయకుంటే.. రాష్ట్రపతి పాలన పెట్టేస్తామని జడ్జీలే చెబుతారన్నారు. ఇలా చెప్పడానికి జడ్జీలెవరు..? సోషల్ మీడియాలో ఏదైనా పెడితే సీబీఐ ఎంక్వైరీ వేసేస్తున్నారన్నారు. ల్యాండ్ వివాదాల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. ఎఫ్‌ఐర్‌ను క్వాష్ చేస్తున్నారన్నారు.