కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ది టెర్మినేటర్` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్ 2` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. అవతార్ 1 అంత హిట్ టాక్ ను అందుకోలేదు.. అయితే తాజాగా జేమ్స్ కామెరూన్.. ఓ ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
కృత్రిమ మేధ మానవ జాతి మనుగడపై ప్రభావం చూపిస్తుందని ఇటీవల కొందరు వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. దాంతో జేమ్స్ కామెరూన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కృత్రిమ మేధకి ఆయుధీకరణ చేస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, తాను ఆ వ్యాపారవేత్తలతో ఏకీభవిస్తున్నానని, ఈ విషయంపై తాను 1984లోనే హెచ్చరించానని, కానీ దాన్ని పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు.. అంతేకాదు సినిమాలో లాగానే బయట కూడా జరుగుతుందని చెప్పాడు..
ప్రస్తుతం ఉన్న పోటీకి సమానంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పోటీ చేరుకుంటుందని భావిస్తున్నానని, వాటిని మనం త్వరగా అభివృద్ధి చేయకపోతే వేరెవరో ముందుంటారు కాబట్టి పోటీ పెరుగుతుందని ఆయన వెల్లడించారు. యుద్ధ భూమిలో కృత్రిమ మేధ వినియోగం గురించి చెబుతూ కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయని, వాటిలో మానవులు జోక్యం చేసుకోలేరని తెలిపారు. అప్పుడు శాంతి చర్చలు,యుద్ధ విరమణ అవకాశాలు లేకుండా పోతాయన్నారు..ఏఐతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని, అది ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. కొద్ది రోజుల క్రిత అత్యుధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ కొందరు టెక్ నిపుణులు బహిరంగ లేఖ రాశారు. దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్లీవ్ వోజ్నియాక్ సహ వెయ్యి మందికిపైగా నిపుణులు సంతకం చేశారు.. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..