జగన్ గుడ్ న్యూస్…అర్హులై లబ్ధి పొందలేనివారికి సాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో నవరత్నాల ద్వారా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారు అనేక మంది వున్నారు. వారిని దృష్టిలో వుంచుకుని లబ్ది చేయనున్నారు సీఎం జగన్ . అర్హులై పథకాలు పొందలేక పోతున్న వారి దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధం అయింది.
ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ధి అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ 9,30,809 మంది అర్హులైన లబ్ధిదారులకు 703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల కింద జమ చేయనున్నారు సీఎం వైయస్.జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో నిధుల జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. అదనంగా 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు అందచేస్తారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు అందచేయనున్నారు. మొత్తంగా 18,48,596 మందికి ప్రయోజనాలు అందించనున్నారు సీఎం జగన్. సమాజంలో అందరికీ ప్రభుత్వం ద్వారా సాయం అందించాలని భావిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సంక్షేమ పథకాలు తేవాలని అధికార వైసీపీ భావిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు వున్నా ప్రతి నెల ఒకటవ తేదీన వివిధ వర్గాల వారికి క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తోంది ప్రభుత్వం. గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాల ప్రయోజనాలు వారి చెంతకే అందిస్తోంది.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!