కరోనా వల్ల చితికిపోయిన నేతన్నలు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి పనుల్లో కుదురుకుంటున్నారు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా… వీరికి విద్యుత్ ఛార్జీలు పెంపు గుదిబండగా మారాయి. పరిస్థితి ఇలానే ఉంటే రైతుల్లానే మేము కూడా ఆత్మహత్య చేసుకోవాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు నేత కార్మికులు. పరిశ్రమల కేటగిరీలోకి మార్చి అదనపు బిల్లులు వస్తూలు చేస్తుండటంతో.. నేత కార్మికుల విద్యుత్ ఛార్జీలు రెండు రెట్లు పెరిగాయి. ఈడీ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో నష్టపోతున్నామని…
తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిశారు నటుడు, ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి వివరించారు. అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి…
ఏపీలో నవరత్నాల ద్వారా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారు అనేక మంది వున్నారు. వారిని దృష్టిలో వుంచుకుని లబ్ది చేయనున్నారు సీఎం జగన్ . అర్హులై పథకాలు పొందలేక పోతున్న వారి దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధం అయింది. ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ…
తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి…