రాజ్ కుంద్రా కేసు : శిల్పా శెట్టికి హీరోయిన్ సపోర్ట్

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల అక్రమ ఉత్పత్తి, పంపిణీ అరెస్ట్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. రాజ్ అరెస్ట్ అనంతరం అవి శృంగార చిత్రాలని అశ్లీల చిత్రాలు కాదని ముంబై క్రైమ్ బ్రాంచ్ తో ఆమె వాదించి తన భర్తను సమర్థించింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఆమె పలు మీడియా సంస్థలపై అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని, అంతేకాకుండా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ పరువు నష్టం దావా వేసింది.

Read Also : వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా క్లాసీ లుక్

నిన్న హన్సల్ మెహతా శిల్పా శెట్టికి మద్దతు ఇచ్చారు. చట్టం తన పని తాను చేస్తుందని, ఆమె గౌరవాన్ని కాపాడాలని, శిల్పాకు సహాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ ఆమెపై విమర్శలు ఆపాలని ఆయన అన్నారు. ఇప్పుడు శిల్పా శెట్టికి మద్దతుగా బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా వచ్చింది. ఆమె ట్వీట్ చేస్తూ “పురుషుల తప్పులకు మహిళలను నిందించడం ద్వారా మేము ఒక జాతీయ క్రీడను రూపొందించాము. ఆమె కేసు వేసినందుకు సంతోషం” అంటూ సెటైరికల్ ట్వీట్ చేసింది. రాజ్ కుంద్రా ఇప్పుడు పోర్న్ రాకెట్ ఆరోపణల కారణంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అతని సహచరులను కూడా అరెస్టు చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-