ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి 100 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారబోతున్నదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్యవస్థలు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియన్ డాలర్లుగా మారొచ్చని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది. మొదట 2024లో 100 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్‌ను చేరుకోబోతుందనే వార్తలు రావడం విశేషం.…