భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… మరోసారి 40 వేల మార్క్‌ను దాటి పైకి కదిలాయి కొత్త కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 490 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 39,069 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో 3,12,60,050 మంది కోలుకున్నారు.. ఇక, కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడగా.. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులున్నాయి.. యాక్టివ్ కేసులు 1.21 శాతంగా ఉన్నాయని.. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.