కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్.. దీంతో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించింది.. ఇక అతి తక్కువ సమయంలోనే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్.. ఆదిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు క్యూ కట్టారు ప్రజలు.. దేశ వ్యాప్తంగా అందరికి వేసేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. దీనిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఇక కోవిడ్ డోసుల పంపిణీలో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన భారత్.. ఇవాళ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్ల డోసుల సంఖ్య 125 కోట్లు దాటినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది కేంద్రం.