ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేతో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ప్రారంభించనుంది.
భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ వాంఖడేలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రోహిత్ దురం కావడంతో ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల్లో సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది భారత్. ఇప్పుడు అదే ఊపులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆసీస్.. వన్డేల్లో మరింత బలంగా కనిస్తోంది. కమిన్స్ ఈ సిరీస్‌కూ దూరం అయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో జట్టును నడిపించిన స్మిత్.. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. గాయాల నుంచి కోలకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్ రాకతో ఆ జట్టు పటిష్టంగా మారింది. పొట్టి ఫార్మాట్‌లో గత కొంతకాలంగా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యా.. సీనియర్లతో కూడిన జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరం.
Also Read: Tsrtc Special buses: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 50 మంది విద్యార్థినులకో బస్
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా గిల్, కిషన్ వస్తారని పాండ్యా వెల్లడించాడు. అయితే వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయాస్ స్థానంలో ఎవరు ఆడతారని అతను చెప్పలేదు. మూడో స్థానంలో కోహ్లీ, ఆ తర్వాత వరుసగా సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు..గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్.. వికెట్ కీపర్‌గా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. బౌలింగ్ పరంగానూ భారత జట్టు పటిష్టంగా ఉంది.
Also Read: Bandi Sanjay: పేపర్ లీకేజీపై దుమారం..నేడు బండి సంజయ్ దీక్ష
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న ఆతిథ్య జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా నిలబెట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ ODIకి తిరిగి వస్తాడని భావిస్తున్నారు, అయితే గత వారం తన తల్లి మరణించిన తర్వాత కమిన్స్ ఇంట్లోనే ఉండాలని ఎంచుకున్నందున స్మిత్ మొత్తం సిరీస్‌కు ఆస్ట్రేలియన్‌లకు బాధ్యత వహిస్తాడు. వెన్ను గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ సేవలను కూడా భారత్ కోల్పోనుంది. KL రాహుల్ టీమ్ ఇండియాకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ కిషన్ రెగ్యులర్ కెప్టెన్ స్థానంలో ఓపెనింగ్ స్థానంలో శుభ్‌మాన్ గిల్‌తో భాగస్వామిగా ఉంటాడు.