Tsrtc Special buses: టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. 50 మంది విద్యార్థినులకో బస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tsrtc Special buses: తెలంగాణ విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ అవకాసం జూన్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం 100 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ర్టిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. నగరంలోని శివారుల్లోని పలు ప్రాంతలనుంచి వచ్చే విద్యార్థినుల కోసం విద్యాసంస్థల వరకు విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేలా టీఆఎస్‌ఆర్టీసీ ప్రణాళికలను సిద్దం చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా.. విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన మేరకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది ఉదయం గమ్యస్థానానికి తీసుకెళ్లడం సాయంత్రం తిరిగి వారి ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది.
బస్ పాస్‌లు ప్రత్యేక..
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
బస్సులో ప్రయాణించే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్ పాస్‌లను ఇవ్వనున్నారు. బస్సులో కేవలం 50 మంది ఉండేలా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాగా.. ఆర్టీసీకి ఆదాయం సమకూరడంతో పాటు సురక్షితమైన ప్రయాణం అందించడానికి వీలవుతుంది. అయితే.. కళాశాల దూరాన్ని బట్టి బస్సు టిక్కెట్ ధర ఆధారంగా నెలవారీ విద్యార్థులకు ప్రత్యేక పాస్‌ను సమకూర్చనున్నారు. ఇక.. ప్రస్తుతం ఇస్తున్న విద్యార్థుల బస్సు పాస్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆ బస్సులో విద్యార్థినులే ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతి విద్యార్థి ఏడాదికి సుమారు రూ.20 వేలకు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తోంది.
భారం కాకూడదనే..
విద్యార్థినుల కళాశాలలు సొంతంగా ఏర్పాటు చేస్తున్న బస్సుల్లో అధిక ఫీజులు ఉన్నందున కొంత మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ఇలా ప్రతి కళాశాల నుంచి వంద నుంచి రండు వందల విద్యార్థులు సొంతంగా వస్తున్నారని సంస్థ గుర్తించింది. అయితే.. సొంతంగా రవాణా వ్యవస్థ ఉన్న కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. అయితే సామాన్యులు అంత మొత్తం నగదును చెల్లించడం భారంగా పరిణమిస్తూ.. స్తోమతలేక షేర్ ఆటోల్లో ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించి కళాశాలలకు వెళ్తున్నారు.
Bandi Sanjay: పేపర్ లీకేజీపై దుమారం..నేడు బండి సంజయ్ దీక్ష
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!