హైదరాబాద్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థగా పేరుపొందిన మెట్రో రైలు సంస్థ నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోకు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. మరోవైపు గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఆర్థిక ఇబ్బందులను వివరించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు.…