* ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. విజయవాడ నుంచి ఉదయం 9.45కి ఢిల్లీకి బయలుదేరనున్న సీఎం..
* నేడు లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేయనున్న ఏసీబీ కోర్టు.. నిందితుల్ని వర్చువల్ గా లేదా కోర్టుకు తీసుకు వచ్చి హాజరుపర్చనున్న సిట్..
* నేడు కామారెడ్డి జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటన.. వన మహోత్సంతో పాటు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష.. మహిళా సదస్సులో పాల్గొననున్ను మంత్రి.
* నేడు దేవరకొండలో సీపీఐ 23వ జిల్లా మహా సభలు.. హాజరు కానున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని, జాతీయ సమితి సభ్యులు పల్లా, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం.
* నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న భేటీ.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చ.. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
* నేడు బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ కమిటీ కీలక సమావేశం.. భారత్ జోడో భవన్ వేదికగా భేటీ.. 24 మంది సభ్యులు, 31 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఓబీసీ సలహా మండలి సమావేశం.. సభకు అధ్యక్షత వహించనున్న డా. అనిల్ జైహింద్. హాజరుకానున్న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఓబీసీ సంక్షేమంపై సమగ్ర చర్చకు సిద్ధమైన కాంగ్రెస్..
* ఐఎస్ఎస్ నుంచి భూమికి బయల్దేరిన శుభాంశు శుక్లా.. నేడు కాలిఫోర్నియా తీరంలో దిగనునన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్.. 22 గంటల ప్రయాణం తర్వాత పసిఫిక్ సముద్ర తీరంలో దిగనున్న స్పేస్ క్రాఫ్ట్.. దాదాపు 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుక్లా టీమ్..