అహంకారంపై రైతుల స‌త్యాగ్ర‌హం విజ‌యం…

కొత్త సాగుచ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  రైతు చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌డంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ నేత‌లు రైతు చట్టాలు వెన‌క్కి తీసుకోవ‌డంపై స్పందించారు.  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.  కేంద్ర‌ప్ర‌భుత్వం అహంకారాన్ని రైతుల స‌త్యాగ్ర‌హం ఓడించిందని ట్వీట్ చేశారు.  రైతు చ‌ట్టాలు తీసుకురావ‌డ‌మే త‌ప్ప‌ని,  రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నార‌ని, ఈ పోరాటంలో అనేక‌మంది అన్న‌దాత‌లు ప్రాణాలు కోల్పోయారు.  ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చి రైతుల‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని రాహుల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రాహుల్ గాంధీ గ‌తంలో మాట్లాడిన వీడియోను కూడా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  

Read: ప్ర‌పంచంలో త‌ప్ప‌క చూడాల్సిన ప్ర‌దేశాలు…

Related Articles

Latest Articles