Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Guntur Corporators Naya Vasool Rajas

గుంటూరు ట్యాక్స్‌…కార్పొరేటర్ల దందా

Published Date :January 12, 2022 , 9:15 pm
By NTV WebDesk
గుంటూరు ట్యాక్స్‌…కార్పొరేటర్ల దందా
  • Follow Us :
  • google news
  • dailyhunt

గుంటూరు ట్యాక్స్‌…! ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్‌. ‘మొన్నటిదాకా మీరు మింగేశారు.. ఇప్పుడు మా వంతు’ అని.. కొత్త తరహా వసూళ్లకు తెరతీశారట కార్పొరేటర్లు. పాతవి.. కొత్తవి అన్నీకలిపి తాజాగా లెక్కలు సరిచేస్తున్నట్టు సమాచారం. ఆ వాటాలపైనే ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

అవినీతిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారా..?
పేరుకు ప్రజాసేవ… చేసేది మరొకటి. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల తీరుపై వినిపిస్తున్న తాజా కామెంట్‌. గడచిన దశాబ్దకాలంగా అధికారుల పాలనలో ఉంది గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌. ఎన్నికలు జరిగాక.. కొత్త పరిపాలన అందిస్తామని ప్రమాణం చేసి మరీ వాటాల వసూళ్లలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారట కొందరు కార్పొరేటర్లు.

కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దుకాణం..?
అధికారుల పాలనలో ఉన్నప్పుడు ఏ పనికైనా.. సీక్రెట్‌గా ఆఫీసర్స్‌ ట్యాక్స్‌ వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నగరంలో వేసిన రోడ్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది ఓపెన్‌ సీక్రెట్‌. ఆ ప్రాంతంలోని పెద్దల నుంచి లోకల్‌ కాంట్రిబ్యూషన్‌ పేరుతోనే 20 నుంచి 30 శాతం కమీషన్‌ వసూలు చేసేవారట. అడిగేవాళ్లు లేకపోవడంతో ఇలా పదేళ్లపాటు ప్రజలను పిండేశారని చెబుతారు. ఒక్క రోడ్లే కాదు.. అనుమతులు లేని భవనాలను కాపాడటానికి సైతం పెద్ద మొత్తంలో ఆఫీసర్స్‌ ట్యాక్స్‌ వసూలు చేసేవారట. ఇవన్నీ కళ్లారా చూసిన కొందరు స్థానిక నేతలు.. మొన్నటి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అన్ని ఆంశాలను ఆకళింపు చేసుకుని.. కార్పొరేటర్లుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దుకాణం తెరిచేశారట.

‘నా సంగతి ఏంటి?.. నా వాటా ఉంటుందిగా..?’ అని డిమాండ్‌
నిర్మాణంలో ఉన్న భవనాలు.. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు.. తమ డివిజన్‌ పరిధిలో ఉన్న ఇతర కట్టడాలను జల్లెడపట్టి ఓ జాబితా సిద్ధం చేశారట. మీ భవనంలో ఈ లోపం ఉంది.. ఆ గీత దాటారు.. పాలనా అనుమతి లేదు అని బెదరగొట్టి.. అదరగొట్టి వసూళ్ల పర్వం మొదలుపెట్టారట కార్పొరేటర్లు. ఇదేకాదు… కొత్త బిల్డింగ్‌ కట్టాలన్నా.. షాప్‌ ఓపెన్‌ చేయాలన్నా ‘ నా సంగతి ఏంటి?’.. నా వాటా ఉంటుందిగా అని ఓపెన్‌గానే అడిగేస్తున్నారట. కొత్తగా కార్పొరేటర్లు అయిన కొద్దిమందిని పక్కనపెడితే.. ఎమ్మెల్యేల ఆశీసులతో కార్పొరేటర్లు అయినవాళ్లు, రాజకీయంగా ముదిరిపోయిన కార్పొరేటర్లు తగ్గేదే లేదన్నట్టుగా వసూళ్లు చేస్తున్నారట. దీంతో గుంటూరు ట్యాక్స్‌ పరాకాష్టకు చేరుకున్నట్టు సమాచారం.

ఆర్టీసీ కాలనీ, బ్రాడీపేట, కొత్తపేట ఘటనలపై చర్చ
గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో 2020లో శంకుస్థాపన చేసిన భవనానికి 2021 డిసెంబర్‌లో గుంటూరు ట్యాక్స్‌ వసూలు చేశారట. బ్రాడీపేటలో షాప్‌ల బోర్డులు పీకించడంతోపాటు.. కొత్తపేటలో కారు గ్యారేజీ యజమానిని బెదిరించడం.. తదితర ఘటనలను ఉదహరణాలుగా చెబుతున్నారు జనం. ఆయా డివిజన్లకు కార్పొరేషన్‌ అధికారులు వచ్చినా.. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వచ్చినా.. తమ పర్మిషన్‌ లేకుండా ఎలా వస్తారని కొందరు కార్పొరేటర్లు నిలదీస్తున్నారట. దీంతో బాధిత అధికారులు తాము ఉద్యోగం చేయాలా వద్దా అని మేయర్ దగ్గర పంచాయితీ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ఆఫీసర్లు సెలవులు, ట్రైనింగ్‌ పేరుతో గుంటూరు నుంచి జంప్‌.

సయోధ్యకు ఇద్దరు పెద్దల విఫలయత్నం..!
సమస్య పెద్దది అవుతుందని అనుకున్నారో ఏమో.. అధికారులకు, కార్పొరేటర్లకు మధ్య గ్యాప్‌ పెరగకుండా.. సయోధ్య చేసేందుకు ఇద్దరు పెద్దలు అవగాహనా శిబిరం ఏర్పాటు చేశారట. అక్కడా రాజీ కుదరలేదట. పైగా మీటింగ్‌ ఏర్పాటు చేసిన ఆ ఇద్దరూ.. భవన నిర్మాణదారులు, స్థానిక వ్యాపారులపై చిందులేశారట. ఇదేం పంచాయితీ అని స్థానికులు బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. మరి.. గుంటూరు ట్యాక్స్‌ దినదిన ప్రవర్థమానం అవుతుందో లేక పార్టీ పెద్దలే నాటకీయంగా ముగిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • guntur corporators
  • guntur tax
  • naya vasool rajas
  • off the record

తాజావార్తలు

  • Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే?

  • Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..

  • Form 16: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఫాం-16 ఉండదు..

  • Breaking News: బీజేపీ కార్యాలయం వెలుపల పేలుడు..

  • Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions