ఎయిడెడ్ సంస్థల విలీనానికి గైడ్ లైన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది.
702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని స్పష్టం చేసింది ఉన్నత విద్యా శాఖ. విలీనానికి నాలుగు ఆప్షన్లను ఎయిడెడ్ విద్యా సంస్థలు ముందున్నాయన్న ఉన్నత విద్యా శాఖ తెలిపింది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఆప్షన్-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా విలీనానికి సుముఖత.
ఆప్షన్-2: ఆస్తులు మినహా ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లుగా కొనసాగే అవకాశం.
ఆప్షన్-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.
ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.
ఈ ఆప్షన్లను కచ్చితంగా పాటించాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల్ని బలవంతంగా విలీనం చేసుకుంటోందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం మెమో జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐసీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!