ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. 702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని…