వరంగల్ వైపు టెక్ దిగ్గజాల చూపు.. జెన్ ఫాక్ట్ కి రెడ్ కార్పెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన సీఈఓ ఈ మేరకు ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ నగరానికి జెన్ ఫాక్ట్ కంపెనీని ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ దిగ్గజ కంపెనీ రాకతో వరంగల్ నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గొప్ప భరోసా లభిస్తుందని అనేక ఉపాధి అవకాశాలు లభించే దిశగా వరంగల్ ఐటి పరిశ్రమ ముందుకు వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే వరంగల్ లో ఉన్న సౌకర్యాలు, మానవ వనరుల వలన అనేక ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్, వరంగల్ లాంటి నగరాల్లో తమ పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వరంగల్ నగరం హైదరాబాద్ నుంచి అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉందని, ఉత్తమ విద్యా సంస్థలు వరంగల్ లో ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
Also Read

కంపెనీ సీఈఓ టైగర్ త్యాగరాజన్, కంపెనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఎల్-1, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ అనేక కంపెనీల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేట్ లలో సైతం ఐటీ టవర్ ల పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. వరంగల్ నగరంలో టెక్ మహీంద్ర, మైండ్‌ట్రీ, సయంట్ వంటి కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
తమ కంపెనీ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న పోచారం క్యాంపస్ కి కేవలం గంటన్నర దూరంలోని వరంగల్ క్యాంపస్ రానుందన్నారు కంపెనీ సీఈఓ త్యాగరాజన్ తెలిపారు. ఈ కంపెనీ ప్రతినిధి బృందం వరంగల్‌లో ఐటీ పరిశ్రమకు అనుకూలంగా ఉన్న ఎన్ఐటి వంటి విద్యా సంస్థలతో పాటు అనేక ఇంజనీరింగ్ కాలేజీ లను పరిగణనలోకి తీసుకుంది. తమ కంపెనీకి భవిష్యత్తులో వరంగల్ నగరం ఒక కీలకమైన టెక్ సెంటర్ గా మారనుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీకి వివిధ దేశాల్లో సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. జెన్ ఫాక్ట్ రాకతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయి.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..