హైదరాబాద్‌లో ఐటీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగర నలుమూలల విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ కంపెనీలను నగరానికి అన్ని దిశల్లో విస్తరించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే…
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి…