ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇద్దరిని చికిత్స కోసం హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తరలించారు.