కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది. అయితే ఈ కరోనా వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. శ్మశానల వద్ద శవాల గుట్టలు మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంట గలుపుతుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా జల్వార్ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆమెను కోటాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడినా.. సీమ చివరకు మృతి చెందింది. అయితే ఆమె మృత దేహాన్ని స్వగ్రామం జల్వార్ గ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవరు 35,000 డిమాండ్ చేశాడు. దీంతో అంత ఇచ్చుకోలేమని సీమ తండ్రి మృతదేహాన్ని ప్యాక్ చేసి ముందు సీటును పడేలా కిందకు వంచి సీటు బెల్ట్ తో కదలకుండా కన్నీరు పెట్టుకుంటూ, కారు నడుపుతూ మృత దేహాన్ని ఇంటికి చేర్చాడు. అయితే మార్గమధ్యంలో కొందరు ఈ ఫోటోలను తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన జైపూర్ కలెక్టర్ కు తెలిసింది. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.