తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అయిన ఎఐఎడిఎంకె చీఫ్ గా మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామిని ఎన్నికైయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై గత కొంత కాలంగా మాజీ సీఎంలు ఈపీఎస్- ఓపీఎస్ ల మధ్య వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ఓపన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన సవాలను హైకోర్టు తిర్కరించింది. దీంతో పళనిస్వామికి మార్గం సుగుమమైంది. వెంటనే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ని అధికారికంగా ప్రకటించింది. నాయకత్వ వివాదానికి పరిష్కారం లభించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.
Also Read:Selfie Video: దువ్వాడలో దంపతుల సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం..
మరోవైపు OPS టీం ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌కు అప్పీల్ చేసే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత ఏడాది జూలైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ఆమోదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. తాత్కాలిక చీఫ్‌గా ఆయన కొనసాగింపునకు సుప్రీంకోర్టు నెల రోజుల క్రితం పచ్చజెండా ఊపింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం తీసుకునే బాధ్యతను మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక కోసం EPS శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
Also Read:Separatist: వేర్పాటువాదులపై అణిచివేత.. పంజాబ్ పోలీసులకు సిక్కుల అల్టిమేటం
సంస్థాగత ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి నిర్వహించాలి. అత్యున్నత పదవిని ప్రాథమిక సభ్యులు ఎన్నుకుంటారు. ఎన్నుకోబడిన ప్రధాన కార్యదర్శి మాత్రమే సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తారు. అయితే, ఇందుకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని మాజీ సీఎం ఓపీఎస్ ఆరోపిస్తున్నారు. సరైన ప్రక్రియ లేదని, వారు జేబు దొంగలా చేసే విధంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారని ఓపీఎస్ విమర్శించారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ప్రధాన కార్యదర్శి జె జయలలిత మరణించినప్పటి నుండి పార్టీకి ద్వంద్వ నాయకత్వం ఉంది. OPS, EPS వరుసగా అన్నాడీఎంకే సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. అయితే ఇటీవల ఈపీఎస్ వర్గం ఒకే నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. జూలై 11, 2022న ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు నేతల మధ్య నాయకత్వ పోరు నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పన్నీర్‌సెల్వం, అతని సహాయకులను బహిష్కరించింది.
Also Read:Sai Pallavi: ముంబైలో మెరిసిన ఎర్ర గులాబీ…
ఇదిలా ఉంటే.. మరోసారి మాజీ సిఎం పన్నీరు సేల్వం రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పన్నీర్ సెల్వం బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎఐడిఎంకెలో ఎంట్రీ కష్టం అవ్వడంతో ఆలోచన పడ్డా ఓపిఎస్.. బిజెపిలో వెలుతారని తమిళనాట పొలిటికల్ సర్కిల్స్ టాక్ వినిపిస్తోంది.