Road Accident: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఢిల్లీ ప్రభుత్వ అధికారి తన SUV కారుతో బైక్‌ను ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢీకొన్న తర్వాత కారు, బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఝండేవాలన్ ప్రాంతంలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌యూవీ డ్రైవర్ ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌సి మీనాగా గుర్తించారు. ఈ ఘటనలో రాపిడో బైక్ నడుపుతున్న యువకుడు ఆసుపత్రిలో…
మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వీఐపీ జోన్ అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అపోలో బస్ స్టాప్, క్యాన్సర్ హాస్పిటల్ తో పాటు తదితర చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. దీంతో మంగళవారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయ్యింది.…
తెలంగాణలో రోజు రోజుకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జల్సాల కోసం మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపుతూ ఎంతో మంది జీవితాలను బలిగొంటున్నారు. కుటుంబాలకు పెద్దదిక్కైన వారు ప్రమాదాల్లో చిక్కుకోవడంతో వారినే నమ్ముకున్న వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు, ఎక్సైజ్, వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా…
రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జోధ్‌పూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ఈరోజుల్లో పిల్లలందరూ తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి?…