వంట గ్యాస్ ధరల మంట.. మరో రూ.100 పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. రికార్డు స్థాయికి చేరిన వంట గ్యాస్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళికి ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 వరకు పెరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం చమురు సంస్థలు వేచి చూస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి రాగానే గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది.
Read Also: పెట్రోల్ రూ.120 దాటేసింది.. ఎక్కడంటే..?
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
కాగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అప్పుడు గ్యాస్ ధర పెరిగే అవకాశం ఉండదు. రిటైల్ ధరలను ప్రభుత్వం నియంత్రించగలిగినా.. గ్యాస్ ధరను పెంచకుంటే చమురు మార్కెటింగ్ సంస్థలపై పడే అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ ఏడాది వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది ఐదోసారి అవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. వచ్చేవారం గ్యాస్ ధరల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952 పలుకుతోంది. వైజాగ్లో సిలిండర్ ధర రూ.908 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో రూ.899.50 వద్ద, ముంబైలో రూ.899.50గా ధరలు ఉన్నాయి.
తాజావార్తలు
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!